ఆకలి కేకల మనుషుల బతుకులు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నా ఎందుకులే అని రాజకీయ నాయకుల విన్యాసాలకి వదిలేసా. మనుషులమని మరిచిపోయి మహారాణులమని అనుకుని బతికే ఇంతులు బంతిలా ఎగురవేసినా, పెంపుడు జంతువులా నటించడం చేతకాదని అటు చూడడమే మానేశా. తీరా చూస్తే నే పరిగెత్తి పరిగెత్తి పట్టుకుందామని వెతికిన జీవిత పరమార్ధం భూటకం అని తేలిపోయింది. కాని మెలుకువ వచ్చేసరికి మొత్తం అయిపోయింది. వెనక్కి వెళ్ళలేను. ముందుకి వెళ్లినా దారి మారలేను.
సాయం చేసేవాడికి ద్రోహం చేసే ఏకైక జంతువుగా పుట్టి, విశ్వం మొత్తం తన కోసేమే సృష్టించబడిందనుకుని ఒక విశ్వకర్తనే సృష్టించిన మనుషులం మనం! మృగాలకన్నా హీనంగా బతకగలం; మనం సృష్టించిన దేవుడికన్నా ఉన్నతంగాను ఉండగలం. ఉన్నాడో లేడో తెలియని వాడికోసం ఒకరినొకరు హింసించుకోగలం! ఈ వేదాంతాల ఎగువ దిగువలు, ఎత్తు పల్లాలు అన్నింటికి నా జీవితంలోని అతి ముఖ్యమైన ఒక రెండు దశాబ్దాలు తగలబెట్టాను.
మరి మన తక్షణ కర్తవ్యం? దక్షిణంలో కన్యాకుమారి; ఉత్తరంలో హిమాలయం; పక్కనున్న పాకిస్తాన్, ఇక్కడున్న కంచరపాలెం; ఏదైతేనేం తిరగాల్సిన చోటులు చాలానే ఉన్నాయి. Feynman రాసిన Physics పుస్తకాలు; అల్లసాని వారి అల్లికలు; రవీంద్రనాధుడి కథలు - కవితలు. చదవాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. గుండె లోపలనే దాచిన పుండులు ఎండలో పెట్టి కాస్త ఊరట పొందడానికి వ్రాయాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికి lazyగా రోజులు లెక్క పెడుతున్నా కదా అని తీసిపారేయొద్దు. బద్దకంతో బుద్దిగా బొద్దుగా పోరాడుతున్న పరమ వీరుడిని నేను. పక్కనున్న వాళ్లంతా బాగుపడ్డారని తెలిసిన పోటీ పడి బతకడం ఇష్టంలేక పక్కకి తప్పుకున్న ఉదాత్త గుణ శీలుడు నేను. కధలు చెబుతానో లేదో తెలీదు. కలలు కంటున్నానో లేదు తెలీదు. కాని నే కట్టుకున్న గాజు మేడలు పగులగొట్టాలంటే ఒక రాయి కావలి. కానీ ఆ రాయి వెతికుదామంటే బద్దకం బజ్జోమంది. అందుకే ఇలా ఈ ఉపోద్ఘాతం.

No comments:
Post a Comment