Saturday, August 28, 2010

ఈTV@15

సరిగ్గా 15 సంవత్సారాల క్రితం ఈ రోజు ఈ TV పుట్టింది. TV లో దానికి సంబందించిన programme చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మద్యనే google transiletarator ఉపయోగించడం మొదలు పెట్టాను. అది నన్ను చాలా ముగ్ధ పరించింది. ఇది వరకు lekhini .org వాడే వాణ్ని. నా మొదటి తెలుగు టప google transiletarator ఉపయోగిస్తూ ఇంత  ఆనందకరమైన విషయాని గురించి వ్రాయడం ఇంకా ఆనందకర విషయం.


ఇక అసలు సంగతికి వస్తే నేను పదేళ్ళ వయస్సులో ఈTVలో మొదలైంది అని నాకు ఈరోజే తెలిసింది. కాని నేను/నా వయస్సు తెలుగువారంతా మొట్ట మొదట అనుబందం పెంచుకొన్న చానల్ ఇది. ఒక్కసారిగా ప్రోగ్రాముకి వచ్చిన అతిధులంతా వారికి ఈటీవీతో ఉన్న అనుబందాన్ని నెమరు వేసుకొంటుంటే నేనుకూడా నా పాత స్మ్రుతలలోకి వెళ్లి పోయాను. అప్పటిలో ఆ చానల్ లో వచ్చే ప్రోగ్రాములన్ని(దారావాహికలలో వచ్చే పాటలు)  మాకు అన్ని అప్పటిలో కంఠతానే. అవి ఇప్పటికి కూడా గుర్తున్నాయి.


నేను ఈTV గురించి ఎప్పుడూ అనుకొనే విషయం ఈరోజు పద్మశ్రీ Dr. S.P. బాలు నోటి ద్వారా విన్నాను. TRP ratingల  కోసం స్థాయిని, విలువలను తగ్గించుకోకుండా ఉన్న చానల్ ఈTV. ఎన్నో మంచి ప్రోగ్రాములను, సామాజిక స్పృహ కలిగన ఎన్నో ప్రోగ్రాములను అందించిన చానల్ అది. అటువంటి చానల్ ఇలాంటి వసంతాలు ఎన్నో మరెన్నో జరుపోకావాలని, ప్రేక్షకలుకు వినోదం, వికాసం, విజ్ఞానం, ఉపయోగం అందివ్వాలని కోరుకుంటూ  - శశి