ఎలుక పందెమా? ఇదెంటబ్బా! అని తెల్ల మొహం పెట్టకండి. Rat Race అంటే నవ్వు రావడం లేదని ఇలా అన్నాను. ఎలుక పందెం గొప్పతనం ఏమిటంటే మనం మనుషులం అన్ని మరిచిపోయేలా చేస్తుంది. అరె! ఎలుకలకు కూడా అవి ఎలుకలన్న సంగతి బాగా గుర్తుంటుంది, మనకేం పోయేకాలంమండి బాబు! పక్కోడు పరిగెడుతున్నాడని నేను, నేను దూసుకెలిపోతున్నానని నా దూరపు చుట్టం, వాడు ఏదో పొడిచేస్తున్నడనుకొని వాడి బావామరిది. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు జీవితంలో ముందు చేరాలనే ఆలోచనోలో మునిగిపోయి, దిక్కులు చూడకుండా పరిగెడుతున్నామే కాని సరైన దిక్కులో పరిగెడుతున్నామా అని మాత్రం అడగటం లేదు.
ఉదాహరణకి Facebookగాడు. వీడి మూలంగా ప్రపంచంలో ఏదో ఒక మూలనుండే మిత్రులకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పొచ్చు. కాని పక్కింట్లో ఎవడు ఉంటున్నాడో కూడా మనకి తెలియదు. రెండో వాడు Youtubeగాడు. గంటలు తరబడి అవి ఇవి చూస్తాము కాని ఒళ్ళు వంచి సాయం సమయంలో చల్ల గాలిలో తిరగడానికి కూడా మనకి బద్దకమే!
చిన్నపుడు చాల బాగుండేది అండి. ఎండాకాలం కరెంటు కోత. ఇంట్లో దోమల వాత పడలేక మేడ పైకి ఎక్కి చుక్కలు చూస్తూ, కధలు కబురులు చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలంతా "Twinkle Twinkle Little Star" అని అనడమే కాకుండా వాటిని చూస్తున్నారని ఎవరైనా చెబితే మాత్రం నేను చాల సంతోషిస్తాను. ఈ ఎలుక పందెంలో పడి పిల్లలని అదేదో play schools అట! అక్కడ చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. వారం పొడుగునా పిల్లలతో గడిపే తీరిక లేక, వారాంతాలలో shopping mallల చుట్టూ తిప్పి గారాబం చేస్తారు.

పని రాక్షసులు కొందరు. వాళ్ళ ప్రభావం వల్ల మనకి hike రాదనుకొని ఇంకొందరు. దారుణంగా పెరుగుతున్న ధరల ధాటికి తట్టుకోలేక అందరూ. కిక్ సినిమాలో అన్నట్టుగా సంతోషంగా ఉన్న క్షణాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకొనే ఖర్మేమిటండి బాబు!
ఈ ఎలుక పందెం వల్ల ఇంకోటుందండి. అమ్మ భాష అంటే చిన్న చూపు. ప్రపంచీకరణ మూలంగా అందరు ఆంగ్లం నేర్చుకోవడాన్ని నేను తప్పు పట్టను కాని మన భాషను మర్చిపోయి, పిల్లలకు నేర్పించడం మానేసి, తెలుగులో మాట్లాడితే నామోషీగా భావించడం మంచిది కానే కాదు. పోనీ అటు english అయిన సరిగా వచ్చా అంటే అదీ రాదు. రెండిటిని ఎలాబడితే అలా కలిపేసి రెండు భాషలనీ అవమానిస్తున్న వారెందరో! ఇలా చెప్పుకుంటూ పొతే తిన్నది అరిగేదాకానో, మీ చెప్పు తెగే దాకానో వెళ్ళడం ఖాయం. అందుకే ఇవ్వాల్టికి ఇది చాలు.
4 comments:
Nice Post...
Chaala baga rasav anayya
truely said.
idi nenu already chadivesa... chala correct ga cheppav
Post a Comment