Sunday, February 12, 2012

Trends that irk me - I

                                                        What's wrong with our language?

Every time I hear the word "F***", I get annoyed. I feel cheap when I see the word re-spelt and put on T-shirts and there is even a brand of watches that way. It has been only two and half-years since I have been living in a city and therefore I find it very hard to digest when this word is used for all kinds of feelings - anger, excitement, shock, dissent...

I happened to visit a literary festival yesterday in Bangalore and there was a short skit that was performed. I loved the entire skit but for the last part when the son says to his mother "F*** You" more than once. I could tolerate it only because it was a play. But, what I ask is, "Is this the way you talk to a person who gave you birth?" My son will find his skull echoing with the sound of my palm colluding his cheek, if he speaks that way to his mother.(Of course I am still 27 and un-married; I am only saying how offensive I consider it)


And then people repeatedly use the expression "WTF." It only signifies frustration and exasperation; nothing more. To me it symbolizes how happy a person is with his/her life and how often is he/she getting fed up with it. It is certainly a bad symptom.The F-word is still in the vulgar category in a dictionary. It may not be long  to be moved to the colloquial category but I have already missed the bus and I will continue to get irked with this word; especially when girls use it.

Now, coming to the word shit. I have found even myself using this word and have gradually reduced its usage and am trying to completely remove it from my expressions of exclamation marks. People no more call out to their mother when they get hurt; they use this word. There is this short story where a foolish wood cutter is cutting the branch on which he is sitting. Lord Shiva and Mother Parvati are going around Earth and see this.They agree that if he uses the word "Amma", Mother Parvati would go and save him. If he uses the word "Abba," it would be Lord Shiva's turn. But the wood cutter neither says Amma nor says Abba but "Shit."(modified to suit the context) So, he falls down and dies.

Thursday, February 2, 2012

ఎలుకపందెం

ఎలుక పందెమా? ఇదెంటబ్బా! అని తెల్ల మొహం పెట్టకండి. Rat Race అంటే నవ్వు రావడం లేదని ఇలా అన్నాను. ఎలుక పందెం గొప్పతనం ఏమిటంటే మనం మనుషులం అన్ని మరిచిపోయేలా చేస్తుంది. అరె! ఎలుకలకు కూడా అవి ఎలుకలన్న సంగతి బాగా గుర్తుంటుంది, మనకేం పోయేకాలంమండి బాబు! పక్కోడు పరిగెడుతున్నాడని నేను, నేను దూసుకెలిపోతున్నానని నా దూరపు చుట్టం, వాడు ఏదో  పొడిచేస్తున్నడనుకొని వాడి బావామరిది. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు జీవితంలో ముందు చేరాలనే ఆలోచనోలో మునిగిపోయి, దిక్కులు చూడకుండా పరిగెడుతున్నామే కాని సరైన దిక్కులో పరిగెడుతున్నామా అని మాత్రం అడగటం లేదు.

ఉదాహరణకి Facebookగాడు. వీడి మూలంగా ప్రపంచంలో ఏదో ఒక మూలనుండే మిత్రులకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పొచ్చు. కాని పక్కింట్లో ఎవడు ఉంటున్నాడో కూడా మనకి తెలియదు. రెండో వాడు Youtubeగాడు. గంటలు తరబడి అవి ఇవి చూస్తాము కాని ఒళ్ళు వంచి సాయం సమయంలో చల్ల గాలిలో తిరగడానికి కూడా మనకి బద్దకమే!

చిన్నపుడు చాల బాగుండేది అండి. ఎండాకాలం కరెంటు కోత. ఇంట్లో దోమల వాత పడలేక మేడ పైకి ఎక్కి చుక్కలు చూస్తూ, కధలు కబురులు చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలంతా "Twinkle Twinkle Little Star"  అని అనడమే కాకుండా వాటిని చూస్తున్నారని ఎవరైనా చెబితే మాత్రం నేను చాల సంతోషిస్తాను. ఈ ఎలుక పందెంలో పడి పిల్లలని అదేదో play schools అట! అక్కడ చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. వారం పొడుగునా పిల్లలతో గడిపే తీరిక లేక, వారాంతాలలో shopping mallల చుట్టూ తిప్పి గారాబం చేస్తారు.   

పని రాక్షసులు కొందరు. వాళ్ళ ప్రభావం వల్ల మనకి hike రాదనుకొని ఇంకొందరు. దారుణంగా పెరుగుతున్న ధరల  ధాటికి తట్టుకోలేక అందరూ. కిక్ సినిమాలో అన్నట్టుగా సంతోషంగా ఉన్న క్షణాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకొనే ఖర్మేమిటండి బాబు!

ఈ ఎలుక పందెం వల్ల ఇంకోటుందండి. అమ్మ భాష అంటే చిన్న చూపు.   ప్రపంచీకరణ మూలంగా అందరు ఆంగ్లం నేర్చుకోవడాన్ని నేను తప్పు పట్టను కాని మన భాషను మర్చిపోయి, పిల్లలకు నేర్పించడం మానేసి, తెలుగులో మాట్లాడితే నామోషీగా భావించడం మంచిది కానే కాదు. పోనీ అటు english అయిన సరిగా వచ్చా అంటే అదీ రాదు. రెండిటిని ఎలాబడితే అలా కలిపేసి రెండు భాషలనీ అవమానిస్తున్న వారెందరో! ఇలా చెప్పుకుంటూ పొతే తిన్నది అరిగేదాకానో, మీ చెప్పు తెగే దాకానో వెళ్ళడం ఖాయం. అందుకే ఇవ్వాల్టికి ఇది చాలు.