అది Reality showలకు నాంది పలికిన కార్యక్రమము. దాదాపు పదిహేను ఎల్ల క్రితం ఒక తారాజువ్వలా వచ్చి వెళ్ళిన కార్యక్రమము. Reality showలంటే అహంకారాన్ని, కోపతాపాలని ప్రదర్శించడం లేదంటే లోకంలో తాము తప్ప వేరేవ్వరూ కష్టమేరగరన్నట్టుగా కన్నీళ్ళు పెట్టడం అన్న రీతిగా మారిన తరువాత మళ్లీ వాటికి కొత్త అర్ధాన్ని ఇవ్వడానికి వచ్చిన కార్యక్రమము. కళాకారులు ఒకరిని ఒకరు అవామనుపరుచుకునే కొన్ని చెత్త programలను telecast చేయాడానికి వెనకాడని వారికి బుద్ధి చెప్పే విధంగా వచ్చిన కార్యక్రమము. K M రాధాకృష్ణ వంటి మంచి సంగీతకారులను, మరెందరో మంచి గాయనీ గాయకులను సినీ పరిశ్రమకు అందించిన కార్యక్రమము. ఎందరో హేమాహేమీలు ముఖ్య అతిధులుగా వచ్చి ప్రేక్షకులకు ఎన్నో తెలియని విషయాలు తెలియచెప్పే కార్యక్రమము. తెలుగు సంగీతానికి కొత్త హంగులు తెస్తున్న కార్యక్రమము. Melodyకి చావులేదని నిరూపించిన కార్యక్రమము. అది గాన గంధర్వుడు S P బాలసుబ్రమహాణ్యం నిర్వహిస్తున్న పాడుతాతీయగా. పన్నెండుకుపైగా బాషలలో వేలకొలది పాటలు పాడి చరితార్డుడై ఇప్పుడు పాడుతా తీయగా ద్వారా ఎందరో గాయనీ గాయకులను తయారుచేస్తూ తెలుగు కళామ్మ తల్లికి ఎనలేని సేవ చేస్తున్న బాలు గారికి, వారి బృందానికి శతసహస్ర వందానాలు; శత కోటి నీరాజనాలు
No comments:
Post a Comment