ఎనిమిది వందల కోట్ల జనం మూడు వందల అరవై రోజుల్ని పంచుకుంటే ఒక్కరి వాటా ఎంత?
కానీ అదేదో ప్రత్యేకమైన రోజని ప్రంపంచాన్ని ఉద్దరించడానికి బయలు దేరానని ప్రతీ వాడు అనుకోవడం
చిన్నపుడు ఎవ్వరూ నా పుట్టిన రోజు గుర్తించలేదు అని తెగ ఏడ్చేవాడిని.
ఇప్పుడు ప్రతి వాడు గుర్తుపెట్టుకొనే అవసరం లేకుండానే పలకరించేస్తున్నారు - అంతా విగణిత, అంతర్జాలల మహిమ.
మూడు పదుల మూడు ఒకట్లకు చేరాను. ప్రతీ ఏడూ వయసు పెరుగుతోందని బాధ తప్ప గొప్పగా చెప్పుకోవాడానికి జీవితంలో ఏమీ పీకలేదు.
పోనీ ఉన్న జీవతమైన బాగు చేసుకున్నానా అంటే అదీ లేదు. జీవితం అంతా సంకనాకించేశాను.
కానీ జీవితం సంకనాకి పొతే కొన్ని; కాదు కాదు చాలా ఉపోయోగాలు ఉన్నయండోయ్! ఎవ్వడికి జవాబు చెప్పాల్సిన పని లేదు. ఎలాగో అడుగుకి చేరిపోయాంగాబట్టి భయం, దిగులు లేవు. ఏదైనా సాదించగలమేమో అని ఒక చిన్న ఆశ. ఆ ఆశ లేనిదే జీవితం లేదు అన్న ఒక చిన్న realization. ఇది వరకు నా అంచనాలకు, అభిలాషలకు, ఆలోచనలకు - వాటికి నే పెట్టుకున్న గీటురాయిలకు నేనే బానిసగా బ్రతికాను. ఆకలి రాజ్యం చిత్రంలో కమల్ హాసన్ అన్నట్టు, "ఎలాగైనా బ్రతికేద్దాం అనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును. కానీ ఇలాగే బ్రతకాలని అనుకోని" జీవితాన్ని దొబెట్టాను. ఇప్పుడా భయం లేదు. నేను నాకు కూడా జవాబు దారి కాదు!
పొద్దున్న లేస్తే పొట్టకూటికోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. పగటి కలలు కంటూ ఇంత కాలం వదిలేసిన క్షణాలకి విలువ ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఇప్పుడిప్పుడు జీవితం మళ్ళీ మొదలవుతోంది. ఇప్పటి దాకా ఒక లెక్క. ఇప్పటినించి ఇంకో లెక్క. ఇంకో అధ్యాయం మొదలైంది. ఈ దశాబ్దం అయ్యాక మళ్ళీ చరిమిత చరణం చేసుకుందాం. అంతవరకూ శెలవు.
P.S: Exactly eight years ago, I wrote a blogpost(titled Silver Jubilee) on my 25th birthday bookmarking my life till then. This post is the next bookmark.