నాకు తెలుగు భాష పట్ల ఆసక్తిని తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చిన మహానుభావులు ఎందరో. వారందరకి శతసహస్రవందానాలు. ఉడతా భక్తిగా నా వంతు కొన్ని వాక్యాలు
సినిమాలు హిట్లు అవుతాయి; ఫ్లాప్ అవుతాయి. అది ఆర్ధిక శాస్త్రం ప్రకారం వేసే లెక్క. చిత్రాలలో మంచి చిత్రాలు, చాల మంచి చిత్రాలు, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలు కొన్ని వుంటాయి. ఇది రసజ్ఞులు వేసుకొనే లెక్క. ఎప్పటికి నిలిచిపోయే చిత్రాలు అందించిన కాశినాధుని విశ్వనాథ్ గారికి నా ధన్యవాదాలు.
నేను శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి వీరాభిమానిని. పూర్తిగా ఆంగ్లంలో కొట్టిమిట్టడుతున్న నేను మేలుకొని తెలుగు మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టిందే వారి పాడుతా తీయగా కార్యక్రమము వలన. వారికి నిండు నూరేళ్ళు; కాదు కాదు నూట ఇరవై ఏళ్లు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు ఈ కొత్త తరానికి చూపిస్తున్న దారిలో సాధ్యమైనంత మంది నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఆచార్య ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరి సుందరరామమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇందులో ముఖ్యంగా వేటూరి గారిని, సీతారామ శాస్త్రి గారిని చూసి నేను చాల స్పూర్తి చెందాను. వీరందరి పాటలలో మానవాళి యొక్క మనగుడలోని జీవిత సత్యాలు అక్షరాల అలంకరణతో అందంగా అందరిని అలరిస్తాయి.
ఇక శ్రీశ్రీ గారు. బాలు గారికి నేను పెరిగి పెద్దవాడినయిన తరువాత వీరాభిమాని అయితే, వీరికి చిన్నపట్టినుంచే వీరభిమానిని. నాలాగే వీరికి మరో వీరాభిమాని, నాకు చాలా సన్నిహితుడైన మిత్రుడొకడు ఉన్నాడు. మేము కళాశాలో చదువుకొనే రోజులలో, వారి కవితలు నా చేత చదివించి వినేవాడు. వాడికి నేను అవి భాగా చదివే వాడినని అని అభిప్రాయం. అదే నాకు చాల గర్వ కారణం. శ్రీ శ్రీ గారు నేను సైతం అంటూ మన జాతికిచ్చిన స్పూర్తి చిరస్మరణీయం.
ఏంతో సాహసంతో ఈ టప వ్రాయడం మొదలు పెట్టిన నాకు ఇప్పుడు భయం వేస్తోంది. పోతానామాత్యుల పద్యాలూ చదివేటప్పుడు నాకు మతి ఎంత చలిస్తుందో నేను మాటలలో చెప్పలేను. అంత గొప్పవారి గురించి నేను వ్రాస్తే కించపరిచినట్టు అవుతుందేమో అని ఒక చిన్న భయం. కాని వారు వ్రాసిన ఆంధ్రమహభాగవతంలోని కనీసం ఒక్క పద్యం కూడా తెలియని ఎందరో తెలుగు వారు వున్నారని, వారిలో ఒక్కరైన నా ప్రయత్నం వల్ల తెలుసుకుంటారేమోననే అత్యాశ. అదే కోవలోకి చెందినా వారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మరియు త్యాగరాజ స్వామి వారు. వారి గురించే వ్రాసే అర్హత నాకు లేదు కనుక వారిని కేవలం స్మరించు కొని వారికి మరొక్కసారి శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను. అసలు ఒక వ్యక్తి తన జీవిత పరిమాణంలో 35000 కీర్తనలు ఎలా వ్రాసాడో నాకు తల కిందులుగా తపస్సు చేసిన అర్ధం కాదు.
ఇక వేమన, బద్దెన, గోపన్న మొదలగు వారు. వారి శతకాల గూర్చి కూడా మాట్లాడే అర్హత నాకు లేదు. శ్రీ కృష్ణదేవరాయలు, వారి భువన విజయము, అష్ట దిగ్గజాలు, ముఖ్యంగా తెనాలి రామకృష్ణులు, అల్లసాని పెద్దన చిరస్మరణీయులు. తెలుగు భాష ఆది కవి అయిన నన్నయ మొదలగు వారిని గూర్చి కూడా నాకు వ్రాసే అర్హత లేదని భావిస్తున్నాను.
ఎక్కడో పుట్టి ఇక్కడికి వృత్తిరీత్యా వచ్చి తెలుగు భాష నిఘంటువుని మనకు అందించిన C.P.Brownకు మనమేల్లరము సర్వదా ఋణగ్రస్తులం.
ఎందరో మహానుభావులు అందరికి వందనములు.
No comments:
Post a Comment